టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పుడు యువ హీరోయిన్ ల హవా గట్టిగా నడుస్తుంది. చాలామంది సీనియర్ హీరోయిన్ లు వీరి దెబ్బకు స్క్రీన్ పై సరిగ్గా కనిపించడం లేదు. వారిలో ఒకరు కాజల్. ఆమె నటించిన ఆఖరి సినిమా ఆచార్య అనే చెప్పాలి. సినిమా లో ఆమె కనిపించినప్పటికీ అదే ఆమె ఆఖరి సినిమా అని చెప్పాలి. ఇప్పుడు ఆమె మళ్ళీ సినిమా లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఆమెకు మేకర్స్ సినిమా అవకాశాలు ఇస్తారా అనేది చూడాలి. వాస్తవంగా చెప్పాలి అంటే ఆమె టాలీవుడ్ సినిమా పరిశ్రమలో చందమామ గా వెలుగొందే టైం లో నే పెళ్లి చేసుకుంది.

మంచి సినిమాల ఆఫర్స్ ఉన్న సమయంలో ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ విధంగా కాజల్ కొన్ని సినిమాలను మధ్యలో వదిలేసుకొని మరీ ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏదేమైనా తన వ్యక్తిగత జీవితం విషయంలో కాజల్ మంచి నిర్ణయం తీసుకుందని ఆమె అభిమానులు చెబుతున్నారు. అయితే ఆమె ఇప్పుడు తెలుగు లో మళ్ళీ కం బ్యాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో కాజల్ ఓ ఐటెం సాంగ్ లో చేయబోతోందని చెబుతున్నారు. అది ఏ సినిమా అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఆమె అభిమానులు మాత్రం ఆమె ఇలా చేయడం ఏమాత్రం నచ్చడం లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో తమ అంద చందాలతో అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న ముద్దుగుమ్మలు తమ కెరియర్ కు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందని చెప్పాలి. ఇప్పటికే కాజల్ అనుష్క వంటి హీరోయిన్ లు తమ కెరియర్ కు దాదాపుగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. వారి చేతిలో గత సంవత్సరన్నర కాలంగా ఒక్క సినిమా కూడా లేదు. అలా కాజల్ చేసే ఈ కం బ్యాక్ ఆమె కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి. ఈ హీరోయిన్ మాత్రమే కాదు చాలామంది సీనియర్ హీరోయిన్ లు ఇప్పుడు సినిమాల్లో మళ్ళీ రాణించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: