ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో అన్న ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది. అయితే ఆది పురుష సినిమా ను మాత్రం సంక్రాంతి కి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అప్డేట్ లు కూడా వస్తున్నాయి. రెండో తేదీన టీజర్ రాబోతుంది. వాస్తవానికి ఈ ఏడాది ప్రభాస్ ఒక్క రాధే శ్యామ్ సినిమా తోనే ప్రేక్షకులను పలకరించాడు. అయన చేస్తున్న సినిమాల సంఖ్య చూసి అయినా సరే ఏడాది కి రెండు సినిమాలు విడుదల కావలసి ఉంది. కానీ ఆయన సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడం ఇంతటి ఆలస్యం కావడానికి కారణం అవుతుంది.

బాహుబలి తర్వాత ప్రభాస్ రెండు సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.  ఆ తర్వాత ఏ సినిమా కూడా ఈ ఏడాది విడుదల అయ్యే విధంగా సిద్ధంగా లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే సలార్ సినిమా ఈ ఏడాది రాబోతుంది అన్నారు. కానీ అది ఎందుకో వర్కౌట్ రావడంలేదు.  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మాత్రం బాలీవుడ్ సినిమా ఆది పురుష్ విడుదల అవుతుంది తప్పా ఏ సినిమా కూడా ఇప్పట్లో విడుదల కావట్లేదు.  ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా రాకపోవడం ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆగ్రహ పరుస్తుంది. తాజాగా అప్డేట్ రావడం అందరిని సంతోషపెడుతుంది.  

బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ ఆది పురుష్ చిత్రం తప్పకుండా భారీ విజయాన్ని అందుకుంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన ఈ సినిమా యొక్క ప్రీ లుక్ కొంతమంది ప్రేక్షకులకు నచ్చడం లేదని తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ మొహం సరిగ్గా కనపడకుండా ఉండడం విల్లుతో నార్మల్ లుక్ లో ప్రభాస్ కనపడడం ఇలాంటివి వారిని నిరాశపరుస్తున్నాయి. మరి ఈ సినిమా ప్రభాస్ అభిమానులను ఏ స్థాయి లో ఆకట్టుకుంటుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: