మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ తొందరలోనే విడుదలకు సిద్ధమయ్యింది. మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసిఫర్ సినిమా కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా లో నయనతార , సత్యదేవ్ ఓ కీలక పాత్ర లో నటిస్తుండగా సల్మాన్ ఖాన్సినిమా లో అతిధి పాత్ర లో నటించడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా కి సంబందించిన అప్డేట్ లు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. అక్టోబర్ 5 వ తదీన ఈ సినిమా విడుదల కావడానికి రంగం సిద్ధమయ్యింది. ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల అయ్యింది.ఈ ట్రైలర్‌కు సినీ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో చిరంజీవి చెప్పిన సూపర్ డైలాగ్స్ అభిమానులకు తెగ నచ్చేశాయి.

మెగా అభిమానులు దేశవ్యాప్తంగా ఏ స్థాయి లో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయన సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఇప్పుడు పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా వాటిని ఈ సినిమా అందుకుంటుందన్న అంచనాలు కలిగివున్నారు ప్రేక్షకులు. సినిమా పై ఉన్న అంచనాలు ఈ ట్రైలర్‌తో రెట్టింపయ్యాయని ఈ సినిమా కు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చెప్పవచ్చు. మోహ‌న్ రాజా దర్శకత్వంలోని సినిమా లోని పవర్ ఫుల్ డైలాగ్స్ అందరిని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. 'రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను. కానీ రాజ‌కీయం నా నుంచి దూరం కాలేదు',  'నేను ఉన్నంత వరకు ఈ కుర్చీకి చెద పట్టనివ్వను' అంటూ చిరంజీవి  చెప్పిన డైలాగ్స్ వేరే లెవల్లో ఉన్నాయి.

ఏదేమైనా చిరు ఈ సినిమా తో మంచి హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది.  అయితే ఈ సినిమా ను మలయాళ లూసిఫర్ సినిమా తో పోల్చడం నిజంగా సినిమా కు ప్రమాదకరమని చెప్పాలి. రీమేక్ సినిమా కాబట్టి ఒరిజినల్ తో పోల్చడం నిజంగా మైనస్ అవుతుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో చాలా మార్పులు చేసినట్లు కనిపిస్తోంది చిరు బాడీ లాంగ్వేజ్ కి తగ్గ మార్పులు కనిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మూవీపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రాన్ని  కొణిదెల ప్రొడక్షన్స్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఎన్వి ప్రసాద్, ఆర్బి చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల కానుంది. మరి ఆచార్య పరాభవం నుంచి కోలుకుని ఈ సినిమా ను చిరు హిట్ చేస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: