పెద్ద హీరోల సినిమాలు విడుదలకు ఉన్నప్పుడు చిన్న హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయాలనుకోవడం పెద్ద రిస్క్ అనే చెప్పాలి. చాలామంది చిన్న హీరోలు ఈ తరహా ప్రయోగం చేయరు. ఎప్పుడో ఒకరు ఇలాంటి రిస్క్ చేస్తుంటారు. అలా ఇప్పుడు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు ఈ రిస్క్ చేశాడని చెప్పాలి. అయన పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్ ప్రస్తుతం హీరోగా పలు సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో అయన ఓ భారీ సినిమా చేస్తున్నాడు. రెండు భాషలలో ఈ హీరో మంచి క్రేజ్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలా బెల్లంకొండ సురేష్ లేటెస్ట్ గా ఆయన చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం చేస్తున్నారు. బెల్లంకొండ గణేష్ హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన మూవీ స్వాతిముత్యం.

సినిమా యొక్క షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కూడా ఇప్పుడు ఆలస్యంగా విడుదల అవుతుంది. ఆనంద్ దేవరకొండ హీరో గా నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా లో హీరోయిన్ గా నటించిన వర్ష బొల్లమ్మ ఈ సినిమా లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ మూవీని యువ దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ తెరకెక్కించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈనేపథ్యంలో మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా గా రూపొందిన ఈ సినిమా తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుందని భావించారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, సాంగ్స్, కి అందరి నుండి మంచి రెస్పాన్స్ రాగా  ఈ మూవీ యొక్క అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా చిరు, నాగ్ సినిమాలకు పోటీగా రావడం నిజంగా అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దసరా సందర్భంగా రాబోయే ఈ సినిమాసినిమా లకు ఏ మాత్రం పోటీ ఇస్తుందో చూడాలి. మరి అన్న బెల్లకొండ శ్రీనివాస్ లాగా ఈ హీరో కూడా మంచి సినిమాలతో క్రేజ్ అందుకుంటాడా అనేది చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్ మహతి అందించిన సాంగ్స్ కి బాగా రెస్పాన్స్ రావడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. సినిమాపై కూడా ఈ సినిమా పై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: