ఇటీవలే ది వారియర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనిసినిమా తో ప్రేక్షకులను ఎంతో నిరాశపరిచాడు. ఆయనకు సరైన మాస్ హిట్ హిట్టుకొట్టి చాలా రోజులైంది అని చెప్పాలి. అంతకు ముందు చేసిన రెడ్ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. అలా 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మరో హిట్ అందుకోలేక పోయాడు రామ్. కథల ఎంపిక అయన వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడే కాదు ఇస్మార్ట్ ముందు కూడా వరుస ఫ్లాప్ లతో సతమతం అయ్యాడు. ఎంతమంది సినిమాలను చేసినా కూడా అవి ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. దాంతో ఇప్పుడు చేయబోయే సినిమా తప్పకుండా హిట్ కొట్టాలని చెప్పి డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

సరిగ్గా ఇప్పుడు అలాంటి సూపర్ హిట్ సినిమా రామ్ కు పడాలి.  అప్పటివరకు లవర్ బాయ్ గా ఉన్న రామ్ ను ఇస్మార్ట్ శంకర్ సినిమా ఊర మాస్ హిట్ తెచ్చి పెట్టగా ఆ సినిమా ఆయనకు మంచి పేరు ను కూడా తెచ్చిపెట్టింది. మాస్ లో కొత్త కోణంలో రామ్ ను చూపించాడు పూరి. ఇకపోతే ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి రామ్ సిద్ధమవుతున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు పెట్టుకోవడానికి రంగం సిద్ధమవుతుంది. రష్మిక మందాన కథానాయికగా ఈ సినిమా లో నటిస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమా అయినా ఆయనకు భారీ విజయాన్ని తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.

ఇకపోతే ఇండస్ట్రీలో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా చేయనున్నాడు అన్న వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.  చెలి సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన గౌతమ్ మీనన్ ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి ఆకట్టుకున్నారు.ఇటీవలే ముత్తు సినిమా తో మరో విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు రామ్ తో తదుపరి సినిమా చేస్తూ ఉండడం విశేషం. ముత్తు సినిమా ను స్రవంతి మూవీస్ బ్యానర్ పై విడుదల చేయగా ఆ బ్యానర్ ను స్థాపించింది రామ్ నన్నే అన్న విషయం అందరికి తెలిసిందే. ఆ నిర్మాణ సంస్థ పై ఈ సినిమా రూపొందనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: