బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ తాజాగా స్వాతిముత్యం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ లో హీరోయిన్ గా నటించిన వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. లక్ష్మణ్ కే కృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే స్వాతిముత్యం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 2 వ తేదీన శిల్పకళా వేదిక , మాదాపూర్ ,  హైదరాబాద్ లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. 

ఇది ఇలా ఉంటే స్వాతిముత్యం మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. స్వాతిముత్యం మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే స్వాతిముత్యం మూవీ తో వెండి తెరకు పరిచయం కాబోతున్న బెల్లంకొండ గణేష్ తన మొదటి మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని  అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే అక్టోబర్ 5 వ తేదీన స్వాతిముత్యం మూవీ తో పాటు చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ ,  నాగార్జున హీరోగా తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ లు కూడా విడుదల కాబోతున్నాయి. ఇలా చిరంజీవి మరియు నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాలతో బెల్లంకొండ గణేష్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: