ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఉంది. కృతి శెట్టి. ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాంతో ఈ ముద్దుగుమ్మ టాప్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అతి తక్కువ సమయంలో టాప్ పొజిషన్ కి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మంచి సినిమాలు ఎంచుకుని ఉంటె ఈమె పెద్ద హీరో ల సరసన హీరోయిన్ గా నటించేది. కానీ ఆమెకు ఆ అవకాశం రాలేదనే చెప్పాలి. తొలి దశలో మంచి హిట్స్ కొట్టడంతో ఆమె టాప్ రేంజ్ కు వెళ్ళిపోతుందని ఆమె అభిమానులు కూడా భావించారు.

దానికి తగ్గట్లుగానే ఆమెకు మంచి విజయాలు కూడా వచ్చాయి. కానీ ఆ తరువాత సినిమాల పరంగా ఆమె ఎవరు ఊహించని ఫ్లాప్ లను అందుకుంది. అనుకోని పరిస్థితుల్లో.. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, వంటి బ్యాక్ టు బ్యాక్ రెండు పరాజయాలను చవి చూసింది. దాంతో ఆమె పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. ఇటీవలే ఆమె ఎన్నో ఆశలతో చేసిన సినిమాఅమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఆమె వరుసగా మూడు ఫ్లాప్ లు అందుకున్న హీరోయిన్ గా నిలిచింది.

మూడు హిట్స్ తో పాటు మూడు ఫ్లాప్ లు కూడా అందుకున్న   కృతి శెట్టి తన కెరీర్ గాడిలో పెట్టుకునేందుకు పలు రకాలుగా చర్యలు తీసుకోబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది. ముందుగా కథ లో తన పాత్ర బాగా ఉండేలా చూసుకుంటుంది. ఆ తర్వాతే సినిమాకు ఒకే చెప్తుందట. తాజాగా  ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అచలుడు అనే ఒక కోలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది.  అలాగే నాగచైతన్యతో కలిసి NC-22 సినిమాలో నటిస్తున్నది.ఇవి మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలను కూడా ఈ ముద్దుగుమ్మ ఒప్పొకుంటుంది. వాటిద్వారా ఈమె మంచి కం బ్యాక్ చేస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: