తెలుగు సినిమా పరిశ్రమలో వేగంగా సినిమాలు చేయగల దర్శకుడు ఎవరంటే అందరు టక్కున చెప్పే మాట పూరీ జగన్నాధ్. దేశంలోనే టాప్ డైరెక్టర్లలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకరు. తెలుగులో దాదాపు అందరి హీరోలతో సినిమాలు చేసిన ఈ హీరో ఇప్పుడు వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు. ఇటీవలే అయన చేసిన లైగర్ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో మళ్ళీ అయన కం బ్యాక్ చేయాలనే ఆలోచనలో అయన ఉన్నాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఇలా అయిపోవడం నిజంగా అందరిని ఎంతో కలవరపరిచే విషయం అనే చెప్పాలి.

అతను తన కెరీర్‌లో సినీ పరిశ్రమ కి కొన్ని బిగ్గెస్ట్ హిట్‌ లను అందించాడు. మరియు లైగర్‌ ప్రేక్షకులను, తన అభిమానులను అందరినీ నిరాశపరిచాడు. అయితే అదే హీరో తో ఈ దర్శకుడు జనగనమన అనే సినిమా చేయాలనీ చూశాడు. కానీ ఫలితం తేడా రావడం తో ఇద్దరు కూడా ఆ సినిమా ను చేయొద్దని అనుకున్నారు. విజయ్ దేవరకొండ వేరే దర్శకుడితో సినిమా చేస్తుంటే ఈ దర్శకుడు మాత్రం తన కొడుకుతో తన తదుపరి సినిమా చేస్తాడని కూడా వార్తలు వచ్చాయి. దీనిలో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు కానీ పూరీ అభిమానులు అయన తదుపరి సినిమా ఎవరితో చేస్తాడో అన్న ఆసక్తి ని కలిగి ఉన్నారు.  

అయితే అసలు విషయం ఏంటంటే, జగన్ ఇప్పటికి ఏ హీరోని కన్ఫర్మ్ చేయలేదు. అతను తన కొత్త సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే హీరో గురించి ఆలోచించే అవకాశం ఉంది.తన డ్రీం ప్రాజెక్ట్ అయినా జనగణమన సినిమా ను ఓ బాలీవుడ్ హీరో తో చేయాలనీ అయన కోరుకుంటున్నారు. మరి అది సక్సెస్ అవుతుందా అనేది చూడాలి. ఇంకోవైపు ఈ దర్శకుడు త్వరలోనే హైదరాబాద్ కి షిఫ్ట్ కాబోతున్నారని చెబుతున్నారు. రామ్ తో సినిమా చేయబోహాన్నారు అని అంటున్నారు. దీనిలో ఏది నిజమో తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.మరింత సమాచారం తెలుసుకోండి: