ఈ మధ్యనే సోషల్‌ మీడియాలో ఓ నిర్మాత- నటి పెళ్లి పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. వాళ్ళే తమిళ పరిశ్రమకు చెందిన నిర్మాత రవీందర్‌ మరియు  సీరియల్‌ నటి మహాలక్ష్మి.


వీళ్ళిద్దరికీ ఇది రెండో పెళ్లే అని చెప్పాలి. రవీందర్ భారీ కాయంతో ఉండడంతో డబ్బు కోసమే మహాలక్ష్మి ఇతన్ని వివాహం చేసుకున్నట్టు చాలా మంది కూడా నెగిటివ్ కామెంట్లు చేశారు. రవీందర్ నిర్మించే ఓ చిత్రంలో లక్ష్మీ నటిస్తూ ఉండడం కూడా ఆ విమర్శల కు ఆజ్యం పోసినట్టు అయ్యింది.


అయితే ఇందు లో నిజం లేదని ఈ జంట ఓ సందర్భం లో చెప్పుకొచ్చింది. ఇద్దరి మనసులు కలవడం.. పైగా ఓ తోడు కావాలి అని భావించడం వల్లనే వివాహం చేసుకున్నట్టు వీరు తెలిపారు. ఇలాంటి ట్రోల్స్ ను వారు లైట్ తీసుకుని తమ వైవాహికజీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారట ఈ దంపతులు.ఈ మధ్యనే హనీమూన్ ‌కి కూడా వెళ్లొచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ జంట గురించి మరో వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. విషయంలో కి వెళితే.. రవీందర్- మహాలక్ష్మీ లు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట.


 


వీళ్ళు ఎంట్రీ ఇవ్వబోయేది తమిళ బిగ్ బాస్ కు.. తెలుగు బిగ్ బాస్ కు కాదు. తమిళంలో సీజన్ 6 ఇంకా ప్రారంభం అయితే కాలేదు. అక్టోబర్ 9 నుండి ప్రారంభం కానుంది. హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చే వారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో రవీందర్-మహాలక్ష్మి పేర్లు కూడా ఉన్నాయనేది తాజా సమాచారం. ఇలాంటి జంట బిగ్ బాస్ కు వెళ్తే టి.ఆర్.పి రేటింగ్ కూడా అదిరిపోతుంది అని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నట్టు సమాచారం. మరి ఇది నిజమో కాదో తెలియాలి అంటే బిగ్‌బాస్‌ ప్రారంభం అయ్యేవరకు వేచి చూడాల్సిందే.మరి చూడాలి ఈ జంట ఎలాంటి వివాదాన్ని తెస్తుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: