ర్యాంకర్ రష్మీ గౌతమ్ చోళీ లెహంగాలో సరికొత్తగా అందాల ప్రదర్శన చేసింది. ముఖ్యంగా బ్యాక్ దాచుకోకుండా మొత్తం చూపించేసింది. రొమాంటిక్ యాంగిల్ లో రష్మీ నడుము వంపులు కవ్విస్తుండగా ఫ్యాన్స్ మతులు పోతున్నాయి.


యాంకర్ గా ఫుల్ స్వింగ్ లో ఉంది రష్మీ. తన ప్రధాన ప్రత్యర్థి అనసూయ ఈటీవిని వదిలిపోవడంతో ఏకఛత్రాధిపత్యం చేస్తుంది. పలు బుల్లితెర షోలతో  ముందుకు దూసుకుపోతుంది.

 
ఇక జబర్దస్త్ యాంకర్ గా అనసూయ తప్పుకున్న విషయం  అందరికీ తెలిసిందే. దీంతో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు షోస్ కి రష్మీనే యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. కొత్త యాంకర్ వస్తుందనుకుంటే మల్లెమాల వాళ్ళు రష్మీకే ఆ బాధ్యత కూడా అప్పజెప్పారు అంట

 
ప్రస్తుతం మల్లెమాల వారి షోస్ లో ఆధిపత్యం మొత్తం రష్మీదే. డాన్స్ రియాలిటీ షో ఢీలో మాత్రమే రష్మీ మిస్. జబర్దస్త్, ఎక్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

 
అలాగే పండుగలకు, పబ్బాలకు మల్లెమాల రూపొందించే స్పెషల్ ఈవెంట్స్ లో  రేష్మీ సందడి చేస్తున్నారు. యాంకర్ గా ఆమెకు తిరుగులేదని చెప్పాలి. అయితే నటిగా రష్మీ చాలా వెనుకబడ్డారు.

 
అనసూయ ఆ కోణంలో దూసుకుపోతుంటే రష్మీ మాత్రం వెండితెర ఆఫర్స్ కోసం వేచి చూస్తున్నారు. నిజానికి అనసూయ కంటే ముందు రష్మీకే హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి. అయితే సినిమా సెలక్షన్ తెలియక రష్మీ ప్లాప్స్ చవిచూశారు.

 
ఓ దశలో రష్మీ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేశారు. ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దీంతో మెల్లగా రష్మీకి ఆఫర్స్ తగ్గాయి. ఒక నిర్మాతతో రష్మీ గొడవపడ్డారని కూడా  మనకు సమాచారం. ఆ వివాదం ఆమె కెరీర్ పై నెగిటివ్ ప్రభావం చూపింది.

 
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... రష్మీ కెరీర్ మొదలైంది నటిగానే. కెరీర్ బిగినింగ్ లో ఆమె చిన్న చిన్న పాత్రలు చేశారు. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో యాంకర్ గా మారారు.

 
జబర్దస్త్ ప్రారంభంలో యాంకర్ గా వ్యవహరించిన అనసూయ వ్యక్తిగత కారణాలతో యాంకరింగ్ నుండి తప్పుకున్నారు. దాంతో రష్మీకి ఛాన్స్ దక్కింది. జబర్దస్త్ ఛాన్స్ రష్మీ దశ మార్చేసింది. హీరోయిన్ కావాలన్న ఆమె కోరిక కూడా తీర్చింది.

 
నటిగా ఆఫర్స్ వచ్చినా రాకున్నా యాంకరింగ్ ద్వారా రష్మీ లక్షలు సంపాదిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా బుల్లితెరపై రాణిస్తున్న రష్మీ బాగానే సంపాదించారు. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోసం గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. రష్మీ ఫోటో షూట్స్ తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: