ఒకప్పుడు కుర్రకారును ఓ ఊపు ఊపెసిన యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టెలివిజన్ ప్రారంభం అయిన తొలి నాల్లల్లో ఈమె ఎంత సక్సెస్ టాక్ ను అందుకుందొ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..ప్రస్తుతం సుమ ఎంత బిజీగా ఉంటుందో… ఎంత భారీ పారితోషికం తీసుకుంటుందో అంత బిజీగా అంత ఎక్కువ పారితోషికం అప్పట్లో ఉదయ భాను తీసుకునేది.అప్పటి బిజినెస్ లెక్కల ప్రకారం చూస్తే ఉదయ భాను రెమ్యునరేషన్ ఏకంగా హీరోయిన్స్ రేంజిలో ఉండేది అనడంలో సందేహం లేదు. ఉదయ భాను కెరియర్ అంతా సాఫీగా సాగుతోంది, 4 సినిమా ఫంక్షన్లో 10 టీవీ కార్యక్రమాలు అన్నట్లుగా ఆమె జోరు మీద ఉన్న సమయంలో అనూహ్యంగా ఆమె జీవితంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి.


ముఖ్యంగా ఆమె పెళ్ళి..ఇది ఒక మిస్టరీగానె ఉంది.ఇప్పటికి కూడా పలు పుకార్లు షికారులు చేస్తూనే ఉంటాయి. జనాల్లో ఉన్న ప్రచారం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే.. ఉదయభాను టీవీల్లో ఎంట్రీ ఇవ్వక ముందే 15వ ఏటా ఒక ముస్లిం వ్యక్తితో పెళ్లి జరిగింది. కొన్ని కారణాలవల్ల అతడి నుండి విడిపోయింది. ఆ తర్వాత ఒంటరి జీవితం సాగిస్తున్న ఉదయ భానుకి కెరియర్ లో సక్సెస్ బూస్ట్ ఇచ్చినట్లయ్యింది. మరే విషయాల గురించి ఆలోచించకుండా కెరియర్ లో ముందుకు వెళుతున్న సమయంలో విజయ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమ మొదలైంది.


జనాలు అనుకునేది మాత్రం.. విజయ్ కుమార్ మొదట్లో ఉదయ భాను వద్ద డ్రైవర్ గా చేసేవాడని.. లేదు ఉదయభాను ఆఫీస్ లో జాబ్ చేసేవాడని రకరకాలుగా అంటూ ఉంటారు. ఆయన ఏం చేసేవాడో కానీ ఉదయ భాను ని మాత్రం ప్రేమలో పడేశాడు. ప్రేమలో పడ్డ తర్వాత పెళ్లి విషయంలో తల్లితో గొడవలు పడింది..ఆమె ప్రేమ కారణంగానే బుల్లి తెరపై సందడి తగ్గిందంటూ బలంగా చెబుతూ ఉంటారు. ఆమె యొక్క నిర్ణయం సరైనదే కానీ ఆమె తల్లి ఆ సమయంలో ఆమెకు మద్దతు తెలపక పోవడం వల్లే కెరియర్లో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె ఈ స్థాయిలో ఉండవలసి వచ్చింది అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ఆమె బుల్లి తెరపై జోరు తగ్గించినా కూడా ఆ తరం ప్రేక్షకులకు ఉదయ భాను అంటే ఒక హీరోయిన్ స్థాయి స్టార్ డమ్‌ ఉన్న యాంకర్ అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆమె మళ్ళీ బుల్లితెర పై తళుక్కుమంది.. అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం..


మరింత సమాచారం తెలుసుకోండి: