మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా ,  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడి గా గుర్తింపు తెచ్చుకున్న సత్య దేవ్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది.

మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా ఈ సినిమా ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ హిందీ ట్రైలర్ ని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ముంబై లో విడుదల చేయనున్నట్లు మరియు ప్రెస్ మీట్ ను ఈ రోజు ముంబై లో 2 గంటలకు నిర్వహించనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించడంతో ఈ మూవీ పై హిందీ ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి గాడ్ ఫాదర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని దక్కించుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: