రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ హలీ ఖాన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మూవీ కి వి ఎఫ్ ఎక్స్ పనులు అత్యధికంగా ఉండడం వల్ల ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే నిన్న ఉదయం ఆది పురుష్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ప్రభాస్ కు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే రేపు అనగా అక్టోబర్ 2 వ తేదీన ఆది పురుష్ మూవీ టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఈ టీజర్ రన్ టైమ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆది పురుష్ టీజర్ 1 నిమిషం 50 సెకండ్ల నిడివితో మూవీ యూనిట్ విడుదల చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ఆది పురుష్ మూవీ ని 12 జనవరి 2023 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: