తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కెరియర్ ప్రారంభంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక మూవీ లలో నటించి తన నటన తో ప్రేక్షకులను అలరించిన ఆకాష్ పూరి ప్రస్తుతం మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఆకాష్ పూరి అనేక మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించాడు. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఆకాష్ పూరి 'చోర్ బజార్' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి జీవం రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాలను నడుమ 24 జూన్ 2022 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన చోర్ బజార్ మూవీ ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం మెప్పించ లేక పోయింది. దానితో చోర్ బజార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ గా మిగిలిన చోర్ బజార్ మూవీ తాజాగా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. చోర్ బజార్ మూవీ ఈ రోజు నుండి అనగా అక్టోబర్  1 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' సంస్థ లలో ఒకటి అయినటు వంటి ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: