టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక దసరాకు ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు, అక్టోబర్ 4వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టీజర్ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే.అయితే ఆదిపురుష్‌ టీజర్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదిలావుంటే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 

ఆదిపురుష్‌ టీజర్ యొక్క నిడివి ఒక నిమిషం 50 సెకన్లు ఉండబోతుందట. సాధారణంగా అయితే టీజర్ నిడివి ఒక నిమిషం కి కాస్త అటు ఇటుగా మాత్రమే ఉంటుంది, కానీ ఇక  ఆదిపురుష్‌ టీజర్ అంతకు మించి అన్నట్లుగా దాదాపుగా రెండు నిమిషాలు ఉండబోతున్న నేపద్యంలో కచ్చితంగా అభిమానులకు మంచి పండగ ట్రీట్ ఉంటుంది అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఇకపోతే భారీ అంచనాల నడుమ రూపొందిన ఆదిపురుష్‌ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే నవంబర్ వరకు వర్క్ పూర్తయి విడుదలకు సిద్ధమవుతుంది.

ఇక  వచ్చే ఏడాది జనవరిలో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే  1000 కోట్లకు పైగా వసూలను ఈ సినిమా దక్కించుకుంటుందని నమ్మకంతో ప్రభాస్ అభిమానులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.ఇకపోతే రాముడిగా ప్రభాస్ నటించగా కృతి సనన్ సీత పాత్రలో కనిపించబోతుంది.అయితే  బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ రావణుడిగా కనిపించబోతున్నాడు. ఇక ఆదిపురుష్ తో అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్ గుర్తింపు దక్కించుకుంటాడనే నమ్మకంను చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: