మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా విడుదలకు సిద్ధమైంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5 న,దసరా సందర్భంగా విడుదల కాబోతుంది. యువ హీరోలలా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న చిరంజీవి వాటి ద్వారా మంచి విజయాలను కూడా అందుకుంటున్నాడు. ‘సైరా’, ‘ఆచార్య’ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాపులు వచ్చిన సరే చిరు సినిమాల విషయంలో స్పీడ్‌ తగ్గించడం లేదు చిరు. ఇప్పుడు చేసిన మూడు సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలను అయన చేయడానికి సిద్ధమవుతున్నాడు.

మెహర్ రమేష్ దర్శకత్వంలోని ‘భోళాశంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్‌ దశలో ఉన్నాయి. వీటిని త్వరలోనే పూర్తి చేసి తదుపరి సినిమాలకు వెళ్లనున్నారు. ఇకపోతే చిరంజీవి రీమేక్ సినిమాలనే ఎక్కువగా ఒప్పుకుంటున్న క్రమంలో గాడ్ ఫాదర్ సినిమా కూడా రీమేక్ సినిమా నే అయినా నేపథ్యంలో ఈ చిత్రం హిట్ అవదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. గాడ్ ఫాదర్ సినిమా లూసిఫర్ తెలుగు లో కూడా విడుదల అయింది. అయితే ఈ సినిమా చూడడానికి ఎవరు ఇష్టపడరు అన్నప్పుడు ఖైదీ నెంబర్ 150 సినిమా ను ఉదాహరణ గా చూపిస్తున్నారు మెగా అభిమానులు..

తమిళ కత్తి సినిమా కు రీమేక్ అయినా ఖైదీ నెంబర్ 150 సినిమా ను సూపర్ హిట్ చేశారు. అప్పటికే వచ్చిన ఈ సినిమా ను విడుదల చేసి సూపర్ హిట్ కొట్టాడు చిరు. ఆలా గాడ్ ఫాదర్ సినిమా విషయంలో జరుగుతుందని చిరు నమ్మకం. ఇకపోతే మరో రీమేక్‌ సినిమాను చేసే ఆలోచనలో చిరు ఉన్నాడని టాక్‌. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవి ఓ స్పానిష్‌ థ్రిల్లర్‌ను రీమేక్‌ చేసే ఉద్ధేశంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ఓ రిటైర్‌ అయిన డాన్‌ కథ నేపథ్యంలో ఉండనుందట.మరి దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారో అన్నది తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: