బెల్లంకొండ గణేష్ తాజాగా స్వాతి ముత్యం అనే మూ వీలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో బెల్లంకొండ గణేష్ సరసన వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటించగా ,  లక్ష్మణ్ కే కృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు . లక్ష్మణ్ కె కృష్ణమూవీ ని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.  సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని చాలా గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి స్వాతి ముత్యం మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా స్వాతి ముత్యం మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ని కూడా లాక్ చేసినట్లు తెలుస్తుంది. స్వాతి ముత్యం సినిమా 2 గంటల 4 నిమిషాల మామూలు నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. బెల్లంకొండ గణేష్ ఈ మూవీ తోనే వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. మరి మొదటి మూవీ తో బెల్లంకొండ గణేష్ ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే అక్టోబర్ 5 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: