అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాజల్ అగర్వాల్ 'లక్ష్మీ కళ్యాణం' మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చందమామ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఆ తర్వాత మగధీర మూవీ తో అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

మగధీర మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన కాజల్ అగర్వాల్ చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది.  కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా కాజల్ అగర్వాల్ తమిళ ,  హిందీ మూవీ లలో కూడా నటించి అక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే కాజల్ అగర్వాల్ , గౌతమ్ కిచ్‌లు అనే వ్యక్తి ని పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే కాజల్ అగర్వాల్ ఒక పండంటి బిడ్డకు జన్మని కూడా ఇచ్చింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ , లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 మూవీ లో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.  అందులో భాగంగా తాజాగా పూల పూల డిజైన్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో కాజల్ అగర్వాల్ పోస్ట్ చేసింది. కాజల్ అగర్వాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: