ప్రభాస్ హీరో గా నటిస్తున్న తాజా సినిమా ఆది పురుష్. బాలీవుడ్ లో రూపొందిన ఈ సినిమా లో హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల కాబోతున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. అందులో భాగంగా ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ విడుదలై సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటిదాకా ఏ ఫస్ట్ లుక్ పోస్టర్ కి రానటువంటి ట్రాక్షన్ ఈ సినిమా కి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయి లో ఉన్నాయి అని ఇది చెప్తుంది.

వాస్తవంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తరవాత ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తప్పకుండా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నారు.  ఈ సినిమా ను బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేసిన ఈ హిందీ సహా తెలుగు ప్రాజెక్ట్ నుంచి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇకపోతే ఈ సినిమా కోసం హిందూ శక్తులు పని చేస్తున్నట్లు తెలుస్తుంది. హిందుత్వాన్ని చాటిచెప్పే సినిమా కాబట్టి, అందులోనూ రాముడు సినిమా కాబట్టి వారు కూడా ఈ సినిమా ఈ స్థాయి లో రూపొందడానికి, ప్రచారం చేయడానికి సహకారం అందుతుంది అని చెప్పాలి. అందుకే ఈ సినిమా యొక్క టీజర్ ను అయోగ్య లో చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా హిందుత్వాన్ని ప్రభలించే సినిమా గా ఇది తెరకెక్కడం ఈ సినిమా తప్పకుండా మంచి కంటెంట్ తో వస్తుంది అని చెప్పడానికి నిదర్శనంగా మారుతుంది. మరి సక్సెస్ లేని ప్రభాస్సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: