పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణు వర్ధన్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం పంజా అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ ని విష్ణు వర్ధన్ తీసిన విధానం మాత్రం ప్రేక్షకులకు బాగా నచ్చింది. అలాగే ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ ని స్టైలిష్ గా చూపించడంలో విష్ణు వర్ధన్ సూపర్ సక్సెస్ అయ్యాడు.

ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో బెస్ట్ లుక్ లలో పంజా మూవీ లుక్ కి కూడా ప్రేక్షకులు నుండి మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. అలా పంజా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించ కపోయి నప్పటికీ పంజా మూవీ లో పవన్ కళ్యాణ్ ను అదిరిపోయే లుక్ లో చూపించిన విధానానికి మాత్రం విష్ణు వర్ధన్ కు తెలుగు సినీ ప్రేమికుల నుండి మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే విష్ణు వర్ధన్ కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన అజిత్ మూవీ ని త్వరలో దర్శకత్వం వహించ బోతున్నట్లు తెలుస్తుంది.

ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో కొన్ని మూవీ లు తెరకెక్కాయి. మరి కొన్ని రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్ లో మరో  మూవీ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ పిరియాడిక్ సబ్జెక్ట్ తో రూపొందబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అజిత్ , హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తునివు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సంక్రాంతి కి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: