మల్టీ టాలెంట్డ్, బుల్లి తెర హీరో సుడిగాలి సుధీర్ పేరు ప్రతి ఒక్కరికి తెలుసు..ఎందుకంటే బుల్లి తెరపై ఆయన సందడి తగ్గి పోయిందని.. ఆయన ఇక కనిపించడంటూ నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలను వదిలి వెళ్ళి పోయినా సుడిగాలి సుధీర్‌ కి స్టార్ మా వారు పెద్ద షాకిచ్చారు. అక్కడ ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చి ఆ కార్యక్రమం ను క్యాన్సల్ చేశారట. బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో తాము ఆ కార్యక్రమాన్ని చేయలేమంటూ చేతులెత్తేయడంతో సుడిగాలి సుధీర్‌ తిరిగి ఈటీవీలోకి వెళ్లలేక.. ఏం చేయాలో పాలు పోక ఇబ్బందులు పడుతున్నాడని టాక్..
స్టార్ మా వాళ్లు ఈటీవీ నుండి సుడిగాలి సుధీర్‌ ని తీసుకొచ్చారు..కనుక ఇప్పుడు వాళ్లే ఏదో ఒక దారి చూపించే ప్రయత్నం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. బుల్లి తెర వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్బాస్ సీజన్ 6 ఐదవ వారంలో సుడిగాలి సుధీర్‌ సడన్ ఎంట్రీ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న సుడిగాలి సుధీర్ కి కచ్చితంగా మంచి ఆదరణ లభించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించలేక పోతున్నారు. అందుకే ఈ సమయంలో సుడిగాలి సుధీర్‌ హౌస్ లోకి వెళితే కచ్చితంగా ఒక మంచి రేటింగ్ అనేది నమోదు అయ్యే అవకాశం ఉంటుంది.


అతనికి భారీ పారితోషికం కూడా ఇచ్చి మరీ హౌస్ లోకి పంపెందెకు బిగ్ బాస్ రెడీ అయ్యింది.అయితే,ప్రస్తుతం సుడిగాలి సుధీర్‌ క్వారెంటైన్‌ లో ఉన్నాడట. సోమవారం ఎపిసోడ్ లేదా మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో సుడిగాలి సుదీర్ అడుగు పెట్టే అవకాశం ఉందంటూ స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పటికే బుల్లి తెర ద్వారా సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న సుడిగాలి సుధీర్ బిగ్ బాస్ లోకి వెళ్లడంను కొందరు వ్యతిరేకిస్తుంటే.. కొందరు మాత్రం ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగానే ఉందంటూ సుడిగాలి సుధీర్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..ఏది ఏమైనా సుధీర్ ఎంట్రీ ఉందా లేదా అన్నది మరో రెండు రోజుల్లో తెలియనుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: