కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ మరియు డైరెక్టర్ సెల్వ రాఘవన్ కాంబోలో వచ్చిన చిత్రం "నేనే వస్తున్నా". ఈ సినిమా రెండు రోజుల క్రితం తమిళ్ మరియు తెలుగు భాషలలో థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. వాస్తవానికి ఏ సినిమాకు అయినా ప్రమోషన్స్ చాలా ముఖ్యం. సినిమా నుండి ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రేక్షకులకు చేరువయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఈ చిత్ర బృందం మాత్రం విడుదల అయ్యే వరకు సినిమా గురించిన ఎటువంటి క్లూస్ ఇవ్వలేదు. అయితే వీరి కాన్ఫిడెన్స్ ను చూసిన అభిమానులు మరియు సినీ వర్గాలు , ఈ సినిమా ఏదో బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారు.

కానీ అనుకున్నది ఒకటి... అయ్యింది మరొకటి లాగా అయింది సినిమా పరిస్థితి. అంచనాలు భారీగా లేకున్నా.. కనీసం ధనుష్ ఉన్నాడు కదా.. హిట్ అవుతుంది అని అనుకున్నారు. కానీ ధనుష్ తన ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే ఎందుకు ఈ సినిమా ప్లాప్ అయింది అన్నది చూద్దాం.. ముఖ్యంగా ఈ సినిమాను దారుణంగా దెబ్బేసిన అంశాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

* దర్శకుడు సెల్వ రాఘవన్ మంచి కథను తీసుకున్నా నేరేట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ధనుష్ ను ద్విపాత్రాభినయం అనుకున్నప్పుడు ఏ పాత్ర కూడా డీవియేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇందులో ప్రభు పాత్రను చక్కగా డిజైన్ చేసుకున్న సెల్వ రాఘవన్... ఖదీర్ పాత్ర విషయంలో పూర్తిగా తడబడ్డాడు.

* సెల్వ రాఘవన్ మొదటి అర్ధభాగం విషయంలో చాలా క్లారిటీగా సీన్ లను రాసుకున్నాడు. కానీ సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టారు. క్లైమాక్స్ కూడా ఊహించేదిగా ఉండడంతో అక్కడ కూడా ప్రేక్షకులు థ్రిల్ ఫీలవకుండా చేశాడు.

* ఇక ఎప్పుడూ తన సినిమాలలో స్క్రీన్ ప్లే తో ఆకట్టుకునే సెల్వ ఈసారి ఆ మ్యాజిక్ చూపించడంలో విఫలం అయ్యాడు.  

ఫైనల్ గా ధనుష్ , బేబీ సత్య మరియు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ తప్పించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: