బుట్టబొమ్మ పూజా హెగ్దే అంటేనే అందానికి పెద్ద బ్రాండ్ అంబాసిడర్. అటుపై క్యూట్ లుక్స్ కూడా. ఎక్కడా కూడా వంక పెట్టడానికి లేని అందం పూజా హెగ్దే సొంతం.


అందుకే పూజాని బుట్టబొమ్మ.. అని క్యూట్‌గా పిలుచుకుంటారు అభిమానులు అందరు.


అయితే, ఈ మధ్య బుట్టబొమ్మకు దిష్టి తగిలినట్లుంది. కొన్ని జుగుప్సాకరమైన రూమర్లు సర్క్యులేట్ అవుతున్నాయ్ బుట్టబొమ్మ పూజా హెగ్దేపై. అవేంటంటారా.? పూజా హెగ్దే కొన్ని రకాల కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుని అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేసిందనీ సోషల్ వీరులు లీకులు ప్రచారం చేస్తున్నారట..


ఈ క్రమంలోనే పూజా హెగ్దే ఈ మధ్య విదేశాలకు వెళ్లిందనీ, అక్కడే కాస్మోటిక్ సర్జరీ చేయించుకుందనీ కావాలంటే ఫ్రూప్స్ ఇవిగో అని కొన్ని ఫోటోలను  సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారట..మరి ఈ సినిమాతో అయిన మహేష్, త్రివిక్రమ్ మ్యాజికల్ కాంబో కి మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరుకుతుందో లేదో మరి చూడాలి  
అంతకు ముందు, ఆ తర్వాత.. అంటూ కొన్ని ఫోటోలను మార్ఫింగ్ చేసి మరి పూజా హెగ్దేని ట్రోల్ చేస్తున్నారు. అయితే, బుట్టబొమ్మ అసలే అందగత్తె. ఆ పై తెలివి తేటలు కూడా కూసింత ఎక్కువే మరి. అందుకే, తనను ట్రోల్ చేస్తున్న వారికి గట్టిగా నే సమాధానమిచ్చిందట.


ఇలాంటి ప్రచారాలను దయచేసి నమ్మవద్ద నీ, తానెలాంటి సర్జరీలు కూడా చేయించుకోలేదనీ స్పష్టం చేసిందట. అంతేకాదు, పనీ పాటా లేని ఇలాంటి వాళ్ల ప్రచారాలను పట్టించుకునే అవసరమే లేద ని కుండ బద్దలు కొట్టేసిందట.


అయినా, అందాల బుట్టబొమ్మకు అనవసరమైన సర్జరీలు అవసరమా.? చెప్పండి.. అంటూ కొందరు నెటిజన్లు పూజా హెగ్దేకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారట.


ఇకపోతే, బుట్టబొమ్మ పూజా హెగ్దే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో, ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: