ఇటీవల వచ్చిన ఆచార్య సినిమా అంతగా జనాలను ఆకర్షించ లేకపోయింది.దాంతో ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని ప్రత్యేకమైన రోల్ తో మరో సినిమాలో నటిస్తున్నాడు.చిరు అభిమానుల కోసం బ్యాక్‌ టు బ్యాక్‌ లను పట్టాలెక్కించే పనిలో పడ్డారు.ఒకేసారి ఏకంగా మూడు చిత్రాలను లైన్‌లో పెట్టారు. వీటిలో ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రం అక్టోబర్‌ 5న దసరా కానుకగా విడుదలవుతోన్న విషయం తెలిసిందే. వీటితో పాటు భోళాశంకర్‌, వాల్తేరు వీరయ్య లు కూడా లైన్‌లో ఉన్నాయి.


ఇదిలా ఉంటే ఈ లు ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోకముందే చిరంజీవి మరో ను పట్టాలెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. గాఢ్‌ ఫాదర్‌తో మలయాళ ను రీమేక్‌ చేసిన మెగాస్టార్‌ ఈ సారి ఓ స్పానిష్‌ థ్రిల్లర్‌ను రీమేక్‌ చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇక చిరు కెరీర్‌లోనే తొలిసారి ఓ డాన్‌ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. స్పానిష్‌లో తెరకెక్కిన ఈ కథ.. రిటైర్‌ అయిన ఓ డాన్‌ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..


కాగా, ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి చూపు చిరు గాడ్‌ ఫాదర్‌పై పడింది. సూపర్‌ హిట్ మూవీ లూసిఫర్‌ రీమేక్‌, బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఈ చిత్రంలో నటిస్తుండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ కు మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార చిరుకి సిస్టర్‌ రోల్‌లో నటించింది..ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన టీజర్స్,పోస్టర్లు,పాటలు జనాలను విపరీతంగా ఆకట్టుకోవడం తో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి..ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా చిరుకు ఎంత హిట్ ను అందిస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: