సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఈ సంవత్సరం పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇలా సర్కారు వారి పాట మూవీ తో ఈ సంవత్సరం మంచి విజయాన్ని బా క్సాఫీస్ దగ్గర సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఒక షెడ్యూల్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ ని యాక్షన్ సన్నివేశాలతో మూవీ యూనిట్ ప్రారంభించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ దసరా పండగ తర్వాత అక్టోబర్ 10 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో పూజా హెగ్డే , మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించనుంది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ లో పూజా హెగ్డే కూడా ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన బోతుంది. ఈ మూవీ కి ఎస్ ఎస్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా ,  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. సూర్యదేవర నాగ వంశీ తాజా  ఇంటర్వ్యూ లో మహేష్ బాబు మూవీ గురించి మాట్లాడుతూ ...  ఈ మూవీ లో మహేష్ బాబు గారి పాత్ర నెవర్ బిఫోర్ రేంజ్ లో ఉంటుంది అని చెప్పు కొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా తెరకెక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: