సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించ నుండగా , ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించ బోతున్నాడు. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. ఈ మూవీ షూటింగ్ ని యాక్షన్ సన్నివేశాలతో ప్రారంభించారు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ కూడా విజయ వంతంగా పూర్తి అయింది. అక్టోబర్ 10 వ తేదీ నుండి ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ లో మహేష్ బాబు తో పాటు పూజా హెగ్డే కూడా పాల్గొన బోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... మహేష్ బాబు 28 వ మూవీ లో ఒక అదిరి పోయే ఐటమ్ సాంగ్ ను పెట్టే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు , అందులో భాగంగా ఈ ఐటమ్ సాంగ్ లో బింబిసార మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించిన వరిన హుస్సేన్ ని తీసుకునే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ వార్త కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. మహేష్ బాబు 28 వ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: