సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా నిర్మాణం చెందుతుంది . ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది . ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ కూడా విజయవంతంగా పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించ నుండగా ,  తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. పూజా హెగ్డేమూవీ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ లో జాయిన్ కాబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మ్యూజిక్ ఆల్బమ్ డీటెయిల్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... సూపర్ స్టార్ మహేష్ బాబు 28 వ మూవీ లో మొత్తం ఆరు పాటలు ఉండనున్నట్లు ...  అందులో రెండు పాటలు డ్యూయెట్ సాంగ్స్ గాను , రెండు మాస్ సాంగ్ లు గాను , ఒకటి ఐటమ్ సాంగ్ గాను , అలాగే ఒకటి కమర్షియల్ సాంగ్ గాను ఉండనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 28 ఏప్రిల్ 2023 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: