తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్నటు వంటి హీరో లలో ఒకరు అయిన చియాన్ విక్రమ్ తాజాగా కోబ్రా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ సరసన కే జీ ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు. తెలుగు సినీ ప్రేమికులు కూడా ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తెలుగు సినీ ప్రేమికులు కూడా కోబ్రా మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్న కారణంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9 కోట్ల బ్రేక్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇలా భారీ టార్గెట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సా ఫీస్ బరిలోకి దిగిన ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి  షో కే కాస్త నెగటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ టోటల్ తెలుగు రాష్ట్రాల్లో బాక్సా ఫీస్ ముగిసే సరికి 4.02 కోట్ల షేర్ , 6.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 0.98 కోట్ల నష్టాలను మిగిల్చుకొని  బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ మూవీ గా మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: