హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణపై పోలీస్ స్టేషన్ లో హిజ్రాలు  ఒక ఫిర్యాదు చేశారు. నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన బాలయ్య తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తక్షణమే బాలకృష్ణ తమ అభ్యర్ధనలు పరిశీలించి పరిష్కారం చూపించాలన్నారు. సినిమాలు చేసుకుంటూ ఆయన నియోజకవర్గ ప్రజలను  అస్సలు పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.హిందూపురం పోలీస్ స్టేషన్ లో బాలకృష్ణపై కేసు నమోదైంది. ఇక హిజ్రాలు బాలకృష్ణ మీద కేసు పెట్టాడాన్ని టీడీపీ వర్గాలు ఖండించాయి.

రాజకీయ ప్రత్యర్ధులు హిజ్రాల వెనకుండి ఈ చర్యలకు ఏవరో పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. కాగా ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది. తన తండ్రి పేరు తొలగించడంపై బాలకృష్ణ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. తీవ్ర పదజాలంతో వైసీపీ వర్గాలపై విరుచుకుపడ్డారు. ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన నేపథ్యంలో ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు బాలయ్య తన 107వ చిత్ర పనుల్లో  చాలా బిజీగా ఉన్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దసరా కానుకగా టైటిల్ ప్రకటన చేయనున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా... థమన్ సంగీతం అందిస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాలయ్య నెక్స్ట్ సినిమా  అనిల్ రావిపూడితో చేస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీకి కూడా బాలయ్య ప్రణాళికలు వేస్తున్నట్లు  మనకు సమాచారం. చాలా కాలంగా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని బాలయ్య ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అన్ స్టాపబుల్ టాక్ షో త్వరలో ప్రారంభం కానుంది. ఇటీవల అన్ స్టాపబుల్ 2 ప్రమోషనల్ సాంగ్ విడుదల చేశారు. బాలయ్య బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: