ఒకప్పుడు కేవలం సినిమాల్లో నటించిన వారికి మాత్రమే ఎక్కువగా గుర్తింపు వచ్చేది . కానీ ఇటీవల కాలం లో మాత్రం  సినిమాల్లో నటించిన వారి కంటే బుల్లి తెరపై పలు కార్యక్రమాల లో అలరించిన వారికి ఎంతగానో గుర్తింపు వస్తుంది అని చెప్పాలి. ముఖ్యం గా ఇటీవలే కాలం లో కామెడీ షో లలో బుల్లితెరపై ఎంతో మంది  ప్రేక్షకులను అలరిస్తూ తమకంటూ ప్రత్యేక 
మైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు అని చెప్పాలీ.


 ఇలా బుల్లితెరపై బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారి లో జబర్దస్త్ నరేష్ కూడా ఉన్నాడు. జబర్దస్త్ అనే కామెడీ షో లో ఒక సాదా సీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన నరేష్ ఆ తర్వాత టీం లీడర్ గా కూడా మారి పోయాడు అన్న విషయం తెలిసిందే. పిట్ట కొంచెం కూతగనం అనే పదానికి నరేష్ టాలెంట్ బాగా సరిపోతూ ఉంటుంది. చూడ్డానికి చిన్నగా ఉన్న అతను లోపల మాత్రం కొండంత టాలెంట్ దాగి ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే ఎప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమం లో కనిపిస్తూ తన కామెడీ పంచులతో ఆకట్టుకుంటూ ఉంటాడు.


 ఇకపోతే ఇప్పుడు జబర్దస్త్ నరేష్ ప్రేమ లో పడ్డాడు అన్న విషయం తెలుస్తుంది. అదేంటి అనుకుంటున్నారా.. ఇటీవల దసరా పండుగను పురస్కరించుకుని దసరా వైభవం అనే ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగం గా ఒక అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చి నేను నరేష్ ను ప్రేమిస్తున్నాను అంటూ చెబుతుంది. ఒకసారి ఈవెంట్ కు వచ్చినప్పుడు నాతో మాట్లాడాడు.. బుగ్గ కూడా గిల్లాడు అంటూ చెబుతుంది. అంతేకాదు నరేష్ కి స్టేజి మీద ముద్దు ఇవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇక ఇటీవల విడుదలైన ప్రోమోలో ఇదంతా చూసిన నెటిజెన్లు నరేష్ కు ఇంత అందమైన అమ్మాయి దొరికిందా అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: