మా టీవీ లో ప్రసరమయ్యే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్న శ్రీ సత్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో వారం వారం సెలబ్రిటీలు ఎవరెవరు టాప్ లో ఉంటున్నారు..అయితే  ఏ సెలబ్రిటీలు టాప్ లో ఉన్నారు అనే విషయాలను ఓర్మాక్స్ మీడియా వారు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు అందజేస్తూ ఉండడం గమనార్హం.ఈ క్రమంలోనే ప్రతి వారం కూడా వారు జాబితాను విడుదల చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సౌత్ ఇండియన్ స్టార్స్, బాలీవుడ్ స్టార్స్, హీరోలు , హీరోయిన్స్ ఇలా అనేక జాబితాలను

 సదరు మీడియా సంస్థ విడుదల చేస్తున్నట్టుగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ కంటెస్టెంట్ విషయంలో కూడా తాజాగా సోషల్ మీడియాలో సర్వే నిర్వహించడం జరిగింది.ఇక  ఈ వారం తాజాగా ఈ సంస్థ సెప్టెంబర్ 24 నుండి సెప్టెంబర్ 30 వ తారీకు మధ్య సోషల్ మీడియాలో టాప్ లో ఉన్న బిగ్ బాస్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఇక ఈ సందర్భంగా బిగ్ బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ జాబితాను విడుదల చేయగా అందులో టాప్ ఫైవ్ లో నంబర్ వన్ స్థానంలో రేవంత్ నిలిచాడు. రెండవ స్థానంలో శ్రీహాన్ నిలిచాడు. అయితే మూడవ స్థానంలో శ్రీ సత్య నిలవగా..

 నాల్గవ స్థానంలో చలాకి చంటి, ఐదవ స్థానంలో ఫైమా స్థానాలను దక్కించుకోవడం జరిగింది. ఓర్ మాక్స్ అందించిన ఈ సమాచారం ప్రకారం ఈ వారం టాప్ ఫైవ్ లో గీతూ లేకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.అయితే గతవారం శ్రీ సత్య కి నెంబర్ వన్ స్థానం దక్కగా ఈసారి మూడవ స్థానం దక్కడం చాలా గొప్ప విషయం అంటూ చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో ఆటే ఆడని చంటి ఇలా టాప్ ఫైవ్ లో ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈయనకు విపరీతంగా ఫాలోయింగ్ పెరగడానికి కారణం జబర్దస్త్ అని స్పష్టం అవుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: