బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ తాజాగా స్వాతి ముత్యం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ లో హీరోయిన్ గా నటించిన వర్షా బొల్లమ్మ , బెల్లంకొండ గణేష్ సరసన హీరోయిన్ గా నటించింది . లక్ష్మణ్ కే కృష్ణమూవీ కి దర్శకత్వం వహించగా ,  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించారు . ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు .

మూవీ విడుదల తేదీ దగ్గర పడటం తో తాజాగా స్వాతి ముత్యం మూవీ యూనిట్ ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ను చాలా గ్రాండ్ గా నిర్వహించింది . ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగం గా ఈ సినిమా ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ... అక్టోబర్ 5 వ తేదీన స్వాతి ముత్యం మూవీ వస్తోంది. ఈ మూవీ మిమ్మల్ని అస్సలు నిరాశపరచదు.. థియేటర్ కి వచ్చిన అందరికీ కచ్చితంగా ఈ మూవీ వినోదాన్ని పంచుతుంది .

మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినిమా ఫంక్షన్ లో వర్షం లో తడుస్తూ కూడా గుర్తు పెట్టుకుని మా మూవీ గురించి మాట్లాడినందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు  అక్టోబర్ 5 వ తేదీన ఘాట్ ఫాదర్ మూవీ తో పాటు మా మూవీ ని కూడా చూసి ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను అని స్వాతి ముత్యం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సూర్యదేవర నాగ వంశీ చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: