టాలీవుడ్ యువ హీరో లలో ఒకరు అయిన విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఏమైంది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో గా తన కంటూ ఒక మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు  ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ లో విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్‌ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఈ మూవీ ని పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళం లో ‘ఓ మై కడవులే’ టైటిల్ తో విడుదల అయ్యి  భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ ని తెలుగు లో 'ఓరి దేవుడా' అనే టైటిల్ తో రీమేక్‌ చేస్తున్నారు. తమిళం లో ఈ మూవీ కి దర్శకత్వం వహించిన మరిముత్తు తెలుగు లోనూ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఓరి దేవుడా మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ విడుదల చేసింది. తాజాగా ఓరి దేవుడా మూవీ యూనిట్ ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ ని 21 అక్టోబర్ 2022 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: