టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినా మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల పాటు రాజకీయాలపై దృష్టి పెట్టి చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఎలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన ఖైదీ నెంబర్ 150 మూవీ తో చిరంజీవి తిరిగి మళ్లీ సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 మూవీ నుండి గాడ్ ఫాదర్ మూవీ వరకు చిరంజీవి మూవీ లకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా  వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. చిరంజీవి హీరోగా తమన్నా , నయనతార హీరోయిన్ లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి మూవీ ప్రపంచ వ్యాప్తంగా 187.25 కోట్ల  ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా 131.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి హీరోగా తేరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: