మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ పోయిన సంవత్సరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు  క్రాక్ మూవీ తో తిరిగి అద్భుతమైన ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఆ తర్వాత ఖి ,  రామారావు ఆన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు మూవీ లు కూడా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

కాక పోతే ఈ మూవీ లు ప్రేక్షకులను అలరించడంలో చాలా వరకు విఫలం అయ్యాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ వరస మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే రవితేజ ధమాకా అనే మూవీ షూటింగ్ నీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ లో రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ,  ఈ మూవీ కి త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని దీపావళి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి.

కాక పోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ధమాకా మూవీ ని దీపావళి సమయానికి విడుదల చేయక పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ధమాకా మూవీ ని ఎప్పుడు విడుదల చేస్తారో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ధమాకా మూవీ పై మాస్ మహారాజా రవితేజ అభిమానులు భారీ అంతరాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ధమాకా మూవీ ని దర్శకుడు త్రినాధరావు నక్కిన పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: