ప్రస్తుతం హీరో ప్రభాస్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. తను తెరకెక్కించే చిత్రాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు అని చెప్పవచ్చు. ఇక ఆయన అభిమానులు కూడా కాస్త ఆందోళన చెందుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభాస్ మోకాలికి సర్జరీ అయిన సంగతి అందరికీ తెలిసినదే..అయితే ప్రభాస్ ఆ సర్జరీ నుంచి ఇంకా కోలుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను నిన్నటి రోజున చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. అక్కడ ఈవెంట్ కు ప్రభాస్ తో పాటు హీరోయిన్ కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్ కలిసి హాజరయ్యారు.


అయితే టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ అక్కడున్న ర్యాంప్ పైన కాస్త అసౌకర్యంగా నడవడం అభిమానుల సైతం గమనించారు. అయితే చిన్న స్టెప్పులు దిగడానికి కూడా కృతి సనన్, ఓం రౌత్ తో సహాయం తీసుకున్నారు ఎందుకు అని అనుమానం అందరిలోనూ తలెత్తుతోంది. ప్రభాస్ మోకాలికి గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని సందేహాలు కూడా కలుగుతున్నాయి. అభిమానులలో ప్రభాస్ ఆ మధ్య స్పైన్ కు వెళ్లి తన కాలికి శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నట్లు వార్తలు వినిపించాయి. సన్నిహిత వర్గాల నుంచి ఈ విషయం నిర్ధారించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వైద్యులు కూడా ప్రభాస్ను కొన్ని రోజులు విరామం తీసుకోమని చెప్పినట్టుగా తెలుస్తోంది.


ఇటీవల తన పెదనాన్న కృష్ణంరాజు మరణించిన తర్వాత ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్లో పాల్గొనడం జరిగింది ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు సైతం ప్రభాస్ గాయం నుంచి కోలుకున్నారని ఇక ఎప్పటిలాగానే సినిమా షూటింగ్లో పాల్గొంటారని అందరూ భావించారు కానీ ఆది పురుష సినిమా టీజర్ లాంచ్ విషయంలో ప్రభాస్ ఇలా ఇబ్బంది పడుతూ ఉండడంతో గమనించిన అభిమానులు సైతం చాలా కంగారు పడుతున్నారు. మరి అసలు విషయం ఏమిటన్నది ప్రభాస్ టీం స్పందిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: