టాలీవుడ్‌లో సంచలనం ఆర్ఆర్ఆర్ మూవీ. తాజాగా ఈ చిత్రాన్ని అమెరికాలో ని లాస్‌ఎంజిల్స్‌లోని ఓ థియేటర్‌లో ప్రత్యేక షో వేశారట.. ఈ షోకు చిత్ర దర్శకుడు రాజమౌళి కూడా హాజరయ్యారట..


తాజాగా ఈ షో విజయవంతం కావడం పట్ల రాజమౌళి ట్వీటర్ వేదికగా పంచుకున్నారట.. తాజాగా యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దీనిపై స్పందించారని తెలుస్తుంది.. ఈ ఘనతలన్నింటికీ మీరే అర్హులు జక్కన్న అంటూ పోస్ట్ చేశారు. నిన్న దర్శకధీరునిపై రామ్‌ చరణ్‌ ట్వీట్ చేయగా.. ఇవాళ యంగ్ టైగర్ రాజమౌళిని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారట..థియేటర్‌లో ఫ్యాన్స్‌ సందడి: నాటు నాటు సాంగ్‌కు ఫారిన్ ఫ్యాన్స్‌ సైతం డ్యాన్స్‌ చేస్తూ థియేటర్లలో సందడి చేశారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో పంచుకున్న రాజమౌళి ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ 'నా హీరోలు, నా సినిమా, నా పట్ల మీ అభిమానం, ప్రశంసలు చాలా అపారమైనవి. థ్యాంక్స్‌ యూఎస్ఎ' అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఈ సినిమా లో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్ తేజ్ తమ పాత్రలతో అదరగొట్టారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆర్ఆర్ఆర్ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు ను సాధించింది.ఒక్క షో.. రూ.17 లక్షలు: దాదాపు 932 సీట్లు కెపాసిటీ గల థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ షో వేయడంతో సుమారు రూ.17 లక్షలకు పైగా వసూళ్లు వచ్చినట్లు సమాచారం.యూఎస్‌లో జరిగే బియాండ్ ఫెస్ట్‌లో భాగంగా ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేశారని తెలుస్తుంది.. ఈ ప్రత్యేక షో టికెట్లు కేవలం 20 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయని సమాచారం. రాజమౌళి ప్రస్తుతం మహేష్ తో చేయబోయే సినిమా కోసం కథ చర్చలతో ఎంతో బిజీ గా వున్నాడు. ఈ సినిమా ను వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభించనున్నట్లు సమాచారం. మహేష్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: