ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాల లిస్ట్‌ అంటూ తీస్తే.. తొలి స్థానంలో నిలిచే సినిమా 'ఆదిపురుష్‌'.


నిలిచే అంటే.. నిలిచింది కూడా. చాలా సంస్థలు చేసిన సర్వేల్లో ఈ విషయమే తేలింది. అలాంటి సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రాగానే అభిమానులు, ప్రేక్షకుల కళ్లలో ఆనందాన్ని వివరించాడానికి పదాలు అయితే చాలవు. అయితే అంతటి ఎగ్జైట్‌మెంట్‌ సినిమా టీజర్‌లో ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఈ మాట మేం అనడం లేదు. నెటిజన్లే అంటున్నారట.


ఆదివారం భారత్ - దక్షిణాఫ్రికా క్రికెట్‌ మ్యాచ్‌ ఉండటంతో.. ఎప్పుడు ఏడు అవుతుందా అని ఎదురుచూశారు ప్రేక్షకులు. అయితే మొబైల్‌లో ఆదిపురుష్‌ టీమ్‌ సోషల్ మీడియా అకౌంట్‌ ఓపెన్‌ చేసి.. టీజర్‌ కోసం రిఫ్రెష్‌ చేస్తూనే ఉన్నారు. అనుకున్న సమయానికే సినిమా టీజర్‌ వచ్చింది. వెంటనే క్లిక్‌ చేసి చూసి ఎంజాయ్‌ చేద్దాం అనుకున్న ఫ్యాన్స్‌.. చూసి ఎంజాయ్‌ మాట పక్కనపెడితే.. హర్ట్‌ అయ్యారు. దాంతో వెంటనే సోషల్ మీడియా లో ట్రెండింగ్‌ మొదలైంది. సినిమాను మెచ్చుకుంటూ కాదు, సినిమా మీద కోపం చూపిస్తూ.


 


'ఆదిపురుష్‌' సినిమాను మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీలో తీస్తున్నాం అని అప్పుడెప్పుడో చిత్రబృందం చెప్పింది. ఆ తర్వాత ఎక్కడా దాని గురించి మాటలు లేవు. అయితే ఏదో గ్రాఫిక్స్‌లో నాణ్యత కోసం అలా చేస్తారేమో అనుకున్నారంతా. కానీ సినిమా మొత్తం అలానే తీశారు అని టీజర్‌ చూస్తే తెలుస్తోంది. ప్రభాస్‌ లాంటి కటౌట్‌ని అలా చూపించడంతో అభిమానులు తట్టుకోలేకపోయారట. విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో ఏదో కాస్ట్‌లీ కార్టూన్‌ షో చూసినట్లు అనిపించింది అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్లు కూడా చేశారు.


 


ఈ మాత్రం దానికి మళ్లీ తీయాలా ఏంటి? కార్టూన్‌ ఛానల్స్‌లో రామాయణం వస్తుంది కదా అని కొందరు అంటుంటే, దీని కోసమా ప్రభాస్‌ను తీసుకున్నది అంటూ మరికొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఎవరు ఎలా రాసినా.. చెప్పేది మాత్రం ఒకటే. ఈ టీజర్‌ మాకు నచ్చలేదు అనే. అయితే సినిమా మీద హైప్‌ను తగ్గించడానికి టీజర్‌ను ఇలా రూపొందించారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అదే కరెక్ట్‌ అయితే ఓకే. లేదంటే ఇబ్బందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: