సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి హీరోగా సెటిల్ అవ్వాలి అంటే ఎర్రగా బుర్రగా ఉండడమే కాదు ఆరడుగుల ఎత్తు ఆరు పలకల దేహం తప్పనిసరిగా ఉండాలి అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అవడం చాలా కష్టం అని అంటూ ఉంటారు ఎంతో మంది. కానీ కొంతమంది మాత్రం ఇవేవీ లేకుండానే స్టార్ హీరోలుగా ఎదిగిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇలాంటి వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఒకరు.


 ఇక ఇటీవలే స్టార్ హీరోలను చూసుకుంటే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ఈ కోవలోకే వస్తాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  అయితే ఇతను ఎప్పుడో ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ గత 5 ఏళ్ళ నుంచి మాత్రం అతనికి మంచి ఇమేజ్ వచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే హీరోగా వరుసగా సినిమాలు చేయడంతో పాటు ఇక విలన్ పాత్రలని కూడా ఎంతో అద్భుతంగా పోషిస్తున్నాడు అని చెప్పాలి.. అయితే తమిళ హీరో అయినప్పటికీ అటు తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి.


అయితే విజయ్ సేతుపతికి మద్యం తాగే అలవాటు ఉందట.. ఈ క్రమంలోనే అసలు విజయ్ సేతుపతికి మద్యం తాగే అలవాటు ఎలా అయింది అన్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఇదే విషయంపై మాట్లాడిన విజయ్ సేతుపతి తనకు మద్యం ఎలా అలవాటు అయిందో చెప్పుకొచ్చాడు . ఇంటర్ సెకండియర్ చదివేటప్పుడు నుండి చదువు పెద్దగా రాలేదట. మార్కులు కూడా వచ్చేది కాదట. ఆ తర్వాత డిగ్రీ కోసం మూడు కాలేజీలలో సీటు కోసం దర్యాప్తు చేసుకుంటే ఏ కాలేజీలో కూడా సీటు రాలేదట. ఆ సమయంలో ఇంటికి వెళ్ళినప్పుడు తన తండ్రి మద్యం తాగి ఉన్నారని ఇక తండ్రి ముందు ఉన్న మద్యం సీసాలో మద్యం ఉండడం చూసి బాధలో తండ్రి ఉన్నాడు అనేది కూడా గమనించకుండా మద్యం తాగాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే సెటిల్ అవ్వాల్సిన సమయంలో వ్యసనాలకు బానిస కావొద్దు అంటూ యువతకు ఒక మెసేజ్ ఇచ్చారు విజయ్ సేతుపతి.

మరింత సమాచారం తెలుసుకోండి: