డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజిగా ఉన్నాడు.. వరుస పాన్ ఇండియా సినిమాలను చేసుకుంటూ పోతున్నారు.. ప్రస్తుతం అందరి చూపు ఆదిపురుష్ టీజర్ పై ఉంది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ విడుదల వేదికపై ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓం రౌత్ దర్శకత్వంలో, రామాయణం కథాంశంగా నిర్మించిన ఈ ఏకకాలంలో తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ టీజర్ అక్టోబరు 2న అయోధ్యలో సరయూ నది ఒడ్డున విడుదల చేశారు. ఈ సినిమా లో రాముడి పాత్ర లో ప్రభాస్, సీత పాత్ర లో కృతి సనన్ కనిపించనున్నారు. అయితే ఈ వేదికపై ప్రభాస్‌, కృతిసనన్‌ మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.


ఆదిపురుష్‌ టీజర్ విడుదల వేదికపై ప్రభాస్ తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. స్టేజ్ పై ఏర్పాటు చేసిన అధిక కెపాసిటీ లైట్ల వేడికి ప్రభాస్ నుదుటన విపరీతంగా చెమటలు పట్టేసాయి. దాంతో చేత్తోనే చెమటను తుడుచుకుంటున్నారు ప్రభాస్‌. అది గమనించిన కృతి సనన్‌ తన దుపట్టా తో చెమట తుడుచుకోమంటూ అందించబోయారు..దానికి ప్రభాస్ సున్నితంగా వద్దు అని తిరస్కరించి తబ చేతితో చెమటను తుడుచుకుంటూ ఉంటాడు.ఈ ఆసక్తికర సంఘటన అంతా అక్కడి కెమెరాల్లో రికార్డ్ అయింది.


ఇక దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ మరోసారి బాలీవుడ్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ లుక్‌ అదిరిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు..మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది..మొన్నటి వరకూ అనుష్క పేరు నెట్టింట వైరల్ అవుతోంది.. ఇప్పుడు వీరిద్దరి పేర్లు..ఈ విషయం పై డార్లింగ్ డ్తె హార్డ్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.. ఇకపోతే సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చింది.సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.మరింత సమాచారం తెలుసుకోండి: