టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించింది సాయి పల్లవి. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమా లు ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా నటించిన కొన్ని చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. అయితే సాయి పల్లవి సక్సెస్ సినిమాల వెనుక పెద్ద కథే ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తను సినీ ఇండస్ట్రీలో రాణించడానికి వ్యక్తిగతంగా తను తీసుకొనే కొన్ని జాగ్రత్తలని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం


సాయి పల్లవి మాట్లాడుతూ .. తనలో యాక్టింగ్ స్కిల్స్ డాన్సింగ్ స్కిల్స్ అడిషనల్ క్వాలిఫికేషన్ గా కనిపిస్తాయని తెలియజేసింది. ఇక అందుకు తగ్గట్టుగా సాయి పల్లవి డాన్స్ లో కష్టపడే తత్వం కలిగిన హీరోయిన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా ఎన్నో సినిమాలు కూడా ఆమె డాన్స్ ని మనం చూసే ఉన్నాము. ఇదంతా పాత విషయమే అయితే సాయి పల్లవి సక్సెస్ అవ్వడం వెనుక ఒక సీక్రెట్ ఉందని తాజాగా తెలియజేస్తోంది.మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నారా లేదా అనే విషయాన్ని తప్ప మరే ఇతర విషయాలను కూడా పెద్దగా పట్టించుకోదట ముఖ్యంగా కథ అంత తన చుట్టూ తిరగాలి అన్న విధంగా ఉండేదానికి పూర్తి వ్యతిరేకమని తెలియజేస్తోంది.


పాత్ర చిన్నదే అయినా ఎలాంటి నిబంధనలు పెట్టుకోనని పాత్ర కోసం ముందుగా సిద్ధంగా ఉన్నాను లేదా అనే విషయాన్ని మాత్రమే ఆలోచిస్తానని సెట్ లో వాతావరణం తన తోటి సహచరుల అభినయమే తన పాత్ర ఎలా ఉండాలి అని దానిపైన ఆధారపడి ఉంటుందని తెలియజేసింది. ఎలాంటి కథ విన్న చూసినా కూడా ఒక సినిమా విజువల్లాగానే చూస్తానని తెలియజేసింది. స్క్రిప్ట్ విషయంలో సామాన్య ప్రేక్షకుడిలా ఫీలవుతానని తెలియజేస్తుంది. అందువల్లే తాను పోషించే ప్రతి పాత్ర కూడా ఒక అవగాహన వచ్చిన తరువాతనే సినిమాలో నటించడానికి ఒకే చెబుతానని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: