తెలుగు సినీ చరిత్రను ప్రపంచ వ్యాప్తంగా ఛాటిన సినిమా బాహుబలి..పాన్ ఇండియా సినిమాగా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ ను అందుకుంది.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రాలు 'బాహుబలి' ఎలాంటి వసూళ్లు కొల్లగొట్టాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రెండు సినిమాలతో అయితే ముగించేసిన ఈ భారీ సిరీస్ నెక్స్ట్ ఓ వెబ్ సిరీస్ లా అలాగే బాహుబలి 3 కూడా ఉంటుంది అని అనేక న్యూస్ లు సినీ వర్గాల నుంచి బయటకి వచ్చాయి.


అయితే తాజాగా rrr సక్సెస్ సెలెబ్రేషన్స్ నిమిత్తం యూఎస్ లో తన ఫిల్మ్స్ ఫెస్టివల్స్ లో పాల్గొంటున్న రాజమౌళి..అక్కడి మీడియా మరియు ప్రేక్షకుల ఇంటరాక్షన్ లో బాహుబలి 3 పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం ఇపుడు ఆసక్తిగా మారింది. తాను బాహుబలి 3 కోసం ఎప్పుడో హింట్ ఇచ్చానని తాను రివీల్ చేసారు. బాహుబలి 2 సినిమా ఎండ్ కార్డ్స్ ల్లో సరిగ్గా వింటే బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ మహేంద్ర బాహుబలి కొడుకు మహిస్మతి కి రాజు అవుతాడా అన్నట్టుగా డైలాగ్ ఉంటుంది అని తెలిపారు..


అయితే ఈ సినిమా లోనే బాహుబలి 3 కి ఎప్పుడో బీజం వేసినట్టుగా తెలిపారు. దీనితో ఇప్పుడు సినీ వర్గాల్లో రాజమౌళి ఇచ్చిన ఈ అప్డేట్ చాలామంది తెలియని వాళ్ళకి భారీ ఎగ్జైట్మెంట్ ని అందించింది.ఈ సినిమా లో నటించిన ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా యాక్టర్ లు అయ్యారు.ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు.ముఖ్యంగా ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. బాలివుడ్ లో కూడా పాగా వేశారు..వరుస పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారు అన్న విషయం మాత్రం జక్కన్న చెప్పాలి. ఈ సినిమా పై అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చెయ్యాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: