రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్ళి సందడి సినిమా తో ప్రేక్షకులకు దగ్గరైంది శ్రీలీల  ..ఆ సినిమా హిట్ అవ్వడం తో వరుస సినిమా ఛాన్స్ లనూందుకుంది..అందం, చలాకీతనంతో పటు నటనతోనూ ఆకట్టుకుంది ఈ భామ. పెళ్లి సందడి కంటే ముందు పలు కన్నడ ల్లో నటించింది శ్రీలీల. ఇక తెలుగుతో తొలి మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ అమ్మడికి ఇక్కడ వరస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఈ చిన్నదాని ఖాతాలో క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న ధమాకా లో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లో కూడా హీరోయిన్ గా చేస్తోంది శ్రీలీల.


ఇక అనగనగా ఒక రాజా, అదేవిధంగా బాలకృష్ణ అనిల్ రావిపూడి లతోపాటు మరికొన్ని ల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నదానికి మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అఖండ తో సంచలన విజయాన్ని అందుకున్నాడు బోయపాటి. బాలయ్య నటించిన అఖండ తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఈ చిత్రంలో ఉస్తాద్ రామ్ పోతినేని సరసన ఏజెంట్ ఫేం సాక్షి వైద్య కథానాయికగా ఎంపికైందని తెలుస్తుంది..ఇక పోతే ఈ సినిమా లో హీరోయిన్ మారిందని అంటున్నారు. ఈ లో హీరోయిన్ గా శ్రీలీలను హీరోయిన్ గా అనుకుంటున్నారట. శ్రీలీల అయితే రామ్ ఎనర్జీనికి కరెక్ట్ గా మ్యాచ్ చేస్తోందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక దసరా పండుగ రోజున అంటే అక్టోబర్ 5 న ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: