తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి విషయాన్ని అయినా సరే ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి డైరెక్టర్లలో డైరెక్టర్ తేజ కూడా ఒకరు. అందుచేతనే ఈయన వ్యాఖ్యలు ఎప్పుడు కూడా పలు రకాలుగా చర్చనీ అంశంగా మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు వివాదాస్పందంగా కూడా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం తేజ తెరకెక్కిస్తున్న అహింస సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తేజ. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం.

డైరెక్టర్ తేజ మాట్లాడుతూ జనాలు చాలా సెలెక్టివ్ గా థియేటర్లకు వస్తున్నారని వాళ్లను మెప్పించడం అంత తేలికైన విషయం కాదని తెలియజేశారు. ముఖ్యంగా బ్లాక్ బాస్టర్ అనుకుంటున్న పుష్ప సినిమా కూడా బయ్యర్లకు నష్టాన్ని తెచ్చిందని తనకు తెలిసిన వాళ్ళు థియేటర్లో ఈ సినిమాని విడుదల చేయగా కనీసం వారు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని తెలియజేశారు. ఇక థియేటర్లో పాప్ కార్న్ ఇతర తినుబండారాల ధరల విషయంలో కూడా కాస్త ఘాటుగానే స్పందించారు తేజ. సినిమాకు సంబంధించి ప్రతిది ఖరీదు అయిపోతూ ఉంటే టికెట్ బుక్ చేసుకున్న బుక్ మై షో లో కూడా డబ్బులు వసూలు చేసి మరి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు అని తెలిపారు.

ఆ తర్వాత పార్కింగ్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇక థియేటర్కు వెళ్లిన ప్రతి ప్రేక్షకుడు ఏమైనా తిందాము అనుకుంటే అందులో ధరలు చూస్తే  భగ్గుమంటున్నాయి. తంసప్ బయట ఏడు రూపాయలు దొరుకుతూ ఉంటే కానీ లోపల రూ. 100 రూపాయల వరకు వెళుతోంది.. ఇక పాప్ కార్న్ అయితే ఏకంగా రూ. 500 రూపాయల వరకు అమ్మడం చాలా దారుణమని తెలియజేశారు. ప్రతిచోట ఇలా దోచేస్తుంటే ప్రేక్షకులు థియేటర్లకు ఎలా వస్తారని.. రాబోయే రోజుల్లో ప్రేక్షకులు తగ్గుముఖం పట్టడం ఖాయమని తెలియజేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ పరిశ్రమకు ఏర్పడింది రాబోయే రోజుల్లో అన్ని పరిశ్రమలకు ఏర్పడుతుందని తెలిపారు తేజ.

మరింత సమాచారం తెలుసుకోండి: