మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ పోయిన సంవత్సరం క్రాక్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. అలా క్రాక్ మూవీ ఇచ్చిన జోష్ లో రవితేజ వరస మూవీ లను ఓకే చేశాడు. అందులో భాగంగా ఇప్పటికే క్రాక్ మూవీ తర్వాత రవితేజ ఈ సంవత్సరం ఖి ,  రామారావు ఆన్ డ్యూటీ అనే రెండు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు మూవీ లు ప్రేక్షకులను నిరుత్సాహ పరిచాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా రవితేజ వరస మూవీ లలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా రవితేజ , త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. 

మూవీ లో రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీని మరి కొన్ని రోజుల్లోనే మూవీ యూనిట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ధమాకా మూవీ కి సంబంధించిన ఒక అదిరి పోయే అప్డేట్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ నుండి మాస్ క్రాకర్ అనే వీడియోను అక్టోబర్ 21 వ తేదీన ఉదయం 10 గంటల 01 నిమిషానికి విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో రవితేజ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: