బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెస్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించక పోయినప్పటికీ ఈ బాలీవుడ్ హీరో తాను నటించిన హిందీ సినిమాల ద్వారానే ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అలాగే అమీర్ ఖాన్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ నీ సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ "లాల్ సింగ్ చడ్డ" అనే ఒక వైవిధ్యమైన మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ లో అమీర్ ఖాన్ సరసన బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ హీరోయిన్ గా నటించగా , టాలీవుడ్ యువ హీరో లలో ఒకరు అయినటువంటి నాగ చైతన్యమూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఈ మూవీ హిందీ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. తెలుగు లో ఈ మూవీ ని మెగాస్టార్ చిరంజీవి సమర్పించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇలా థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయిన ఈ సినిమా తాజాగా నేట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి స్ట్రీమింగ్ లో అందుబాటు లోకి వచ్చింది ఎవరైనా. ఈ మూవీ ని ఎవరైనా థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: