టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా ,  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా ,  సత్య దేవ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన చాలా గ్రాండ్ గా తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ లభించడంతో ,  ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన ఓపెనింగ్ లు లభించాయి.

అలాగే ఈ మూవీ కి రెండవ రోజు కూడా మంచి కలెక్షన్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా గాడ్ ఫాదర్ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గాడ్ ఫాదర్ మూవీ "ఓ టి టి" హక్కులను నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" సంస్థ భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినట్లు కొన్ని , ఈ మూవీ ని వారాల థియేటర్ రన్ తర్వాత నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: