మెగాస్టార్ చిరంజీవి తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ,  సత్య దేవ్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్ర లో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించాడు.

మూవీ నిన్న అనగా అక్టోబర్ 5 వ తేదీన భారీ అంచనాల నడుమ తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించడం తో ఈ మూవీ పై బాలీవుడ్ సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి మొదటి రోజు బాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కాయి  మొదటి రోజు గాడ్ ఫాదర్ మూవీ హిందీ బాక్సా ఫీస్ దగ్గర 2.05 కోట్ల నెట్ కలెక్షన్ లను సాధించింది.

దీనితో గాడ్ ఫాదర్ మూవీ కి హిందీ బాక్సా ఫీస్ దగ్గర మొదటి రోజు డీసెంట్ కలెక్షన్ లు దక్కాయి అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి తెలుగు తో పాటు హిందీ లో కూడా మంచి టాక్ లభించింది. దాని తో ఈ మూవీ కి రాబోయే రోజుల్లో కూడా హిందీ బాక్సా ఫీస్ దగ్గర మంచి డీసెంట్ కలెక్షన్ లు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో గాడ్ ఫాదర్ మూవీ బాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను రాపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: