టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు శిరీష్ "గౌరవం" మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన గౌరవం సినిమా అల్లు శిరీష్ కు మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందించలేక పోయింది. 

ఆ తర్వాత పలు మూవీ లలో నటించిన అల్లు శిరీష్ కు శ్రీరస్తు శుభమస్తు మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం లభించింది. ఈ మూవీ లో అల్లు శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించగా ,  పరుశురామ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత కూడా అల్లు శిరీష్ కొన్ని మూవీ లలో హీరోగా నటించాడు ,  కానీ ఆ మూవీ లు కూడా పెద్దగా విజయాలను సాధించ లేదు. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అల్లు శిరీష్ "ఊర్వశివో రాక్షసివో" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో బ్యూటిఫుల్ లేడీ అను ఇమ్మానుయేల్ , అల్లు శిరీష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి మూవీ యూనిట్ ఒక టీజర్ ను విడుదల చేసింది. ఆ టీజర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఊర్వశివో రాక్షసివో మూవీ నుండి చిత్ర బృందం ఒక అదిరి పోయే అప్డేట్ విడుదల చేసింది. ఈ మూవీ నుండి "ధీంతాననా"  అనే సాంగ్ ని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్ లో అల్లు శిరీష్ ,  అను ఇమ్మానుయేల్ ఒక కారులో కూర్చొని ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ నుండి చిత్ర బృందం చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: