నటుడి గా ,  నిర్మాత గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి మాస్ ఇమేజ్ కలిగిన హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా కళ్యాణ్ రామ్ "బింబిసార"  అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది.

మూవీ విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో బింబిసార మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఆగస్టు 5 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" విడుదల తేదీపై అనేక వార్తలు బయటకు వస్తున్నాయి.  

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా అక్టోబర్ 7 వ తేదీ నుండి జీ 5  "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక వార్త వైరల్ అయింది. కాకపోతే ఈ సినిమా అక్టోబర్ 7 వ తేదీ నుండి జీ 4 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తుంది.  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బింబిసార మూవీ జీ 5   "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో అక్టోబర్ 21 వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: